రూలర్ తర్వాత బాలకృష్ణ, యూత్ టార్గెట్‌గా నారా లోకేష్

బాబు దారిలోనే హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ, యువనేత నారా లోకేష్‌లు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారట. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న రూలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాను సాధారణ ఎన్నికలకు ముందు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని భావిస్తున్నారట.
ప్రస్తుతం షూటింగులో బిజీగా ఉన్న బాలయ్య అది పూర్తవగానే ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో యాత్ర చేయాలని భావిస్తున్నారట. ఆయన అన్ని జిల్లాలను చుట్టి వచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కొంతకాలం క్రితం వరకు పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే బాబు పాదయాత్ర తర్వాత మారింది. బాబు బస్సు యాత్రతో మరింత మారుతుందని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాలకృష్ణ యాత్ర.. ఆ తర్వాత ప్రచారంలోకి దిగితే తెలుగుదేశానికి తిరుగుండదని భావిస్తున్నారు. మరోవైపు కేవలం యువతే లక్ష్యంగా నారా లోకేష్ కూడా ఓ యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అవినీతి, పాలన పైన యువతలో రాజకీయ చైతన్యం కలిగించాలని లోకేష్ ఈ యాత్ర చేపడుతున్నారట.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!











Click it and Unblock the Notifications