51కోట్ల ఆస్తుల అటాచ్‌పై స్టే: జగన్‌కు తాత్కాలిక ఊరట

YS Jagan
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆస్తుల అటాచ్‌మెంట్ అంశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం తాత్కాలిక ఊరట లభించింది. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ జగన్ ఆస్తుల కేసులో రూ.51 కోట్లను మొదటగా అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

ఈడి అటాచ్‌మెంట్‌కు అనుకూలంగా ఎడ్జుడికేటింగ్ అథారిటీ తీర్పు ఇచ్చింది. అయితే ఈ రోజు ఎడ్జుడికేటింగ్ తీర్పు పైన అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. తదుపరి తీర్పు వరకు రూ.51 కోట్ల మొదటి అటాచ్‌మెంట్ పైన స్టే ఉంటుందని చెప్పింది. అనంతరం ఈ కేసును ఆగస్టు 18వ తేదికి వాయిదా వేసింది.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గతేడాది అక్టోబర్ నెలలో కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. ఈడి రూ.51 కోట్ల రూపాయల విలువ చేసే జగన్ స్థిర, చరాస్తులను జప్తు చేసింది. కుట్రల ద్వారా తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడి వ్యాఖ్యానించింది.

హెటిర్ డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అలాగే జననీ ఇన్‌ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేసింది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన 14.5 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది.

ధర్మానపై సిబిఐ మెమో విచారణ వాయిదా

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను విచారణకు మెమోపై విచారణ వాయిదా పడింది. సిబిఐ దాఖలు చేసిన మెమో పైన విచారణను సిబిఐ న్యాయస్థానం ఆగస్టు 13కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+