ట్విస్ట్: అంజన్‌కు నో, అఖిలేష్ కాన్వాయ్‌పై దాడియత్నం

ఈ రోజు నాగోల్‌లో జరుగనున్న అఖిల భారత యాదవ మహాసభకు హాజరయ్యేందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిన్ననే హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన పార్క్ హయత్ హోటల్లో బస చేశారు. ఉదయం మహాసభకు వెళ్లేందుకు అఖిలేష్ కాన్వాయ్‌తో పాటు రాష్ట్రానికి చెందిన యాదవ నేతలు బయలుదేరారు. అంజన్కుమార్ కాన్వాయ్ కూడా ఉంది.
అఖిలేష్ కాన్వాయ్‌లో వెళ్లేందుకు అంజన్ ప్రయత్నించారు. అయితే అందుకు భద్రతా సిబ్బంది నిరాకరించింది. దీంతో పలువురు అఖిలేష్ కాన్వాయ్ పైన దాడికి యత్నించారు. ఈ ఘటనలో అంజన్ కుమార్ కాన్వాయ్‌లోని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
చిరును కలిసిన అఖిలేష్
అఖిలేష్ యాదవ్ ఈ రోజు ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాస రావు, వట్టి వసంత్ కుమార్‌లు అఖిలేష్‌ను కలిశారు. అంతకుముందు మంత్రి రఘువీరా రెడ్డి ఇంట్లో అల్పాహారం చేశారు.
తలసాని ఇంటికి అఖిలేష్
అఖిలేష్ ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు. అక్కడి నుండి అతను నాగోల్‌లో జరిగే అఖిల భారత యాదవ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications