జగన్‌కు వివేకా పరామర్శ, విజయమ్మ టూర్‌లో సురేఖ

YS Jagan - YS Vivekananda Reddy
హైదరాబాద్/అదిలాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శనివారం జైలులో కలుసుకొని పరామర్శించారు. గత ఏడాది మే 27న అరెస్టైన జగన్‌ను వివేకా జైలులో కలవడం ఇది రెండోసారి. జగన్‌ను ఆయన సతీమణి వైయస్ భారతి, కూతుళ్లు హర్ష, వర్షలు కలిశారు.

వరద ముంపు ప్రాంతాల్లో విజయమ్మ.. వెంట సురేఖ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ శనివారం అదిలాబాద్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఆమె వెంట మాజీ మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, జనక్ ప్రసాద్ తదతిరులు తదితరులు ఉన్నారు.

శనివారం ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరిన ఆమె నేరుగా అదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. జైనథ్ మండలం పెండల్‌వాడను సందర్శించారు. వరదబాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బతికుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, రైతుల సమస్యలపై ఆయన తక్షణమే స్పందించేవారని విజయమ్మ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో జలయజ్ఞం కింద రూ.లక్ష కోట్లతో 64 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, ఆయన మరణాంతరం ఆ ప్రాజెక్టులను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్ బతికుంటే ప్రాణహిత - చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యేవన్నారు. పెండల్‌వాడ ప్రాంతం తరచూ ముంపునకు గురికాకుండా అప్పర్ పెన్‌గంగ ప్రాజెక్టును నిర్మించాలని అక్కడి ప్రజలు కోరారని, వైయస్ బతికున్నప్పుడు అటవీశాఖ అనుమతులు, మహారాష్ర్టతో ఒప్పందాలు జరిగినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పర్ పెన్‌గంగాను ఎన్ని అడ్డంకులెదురైనా పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణపై..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+