సీమను నాశనం చేస్తున్నారు: బాబు, జగన్‌లపై బైరెడ్డి

రాయల ఆంధ్రా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఆంధ్రా, విజయమ్మ తెలంగాణ అని పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే ప్రత్యేక సీమ ఇవ్వాల్సిందే అన్నారు. బైరెడ్డి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సిడబ్ల్యూసికి లేఖ రాశారు.
బొత్సను కలిసిన ఓయు జెఏసి
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన సిడబ్ల్యూసికి తెలంగాణపై నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. తెలంగాణకు అనుకూలంగా ఉండాలని వారు కోరారు.
కిరణ్ తీరుపై నారాయణ ఫైర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు నక్సలిజానికి సంబంధం లేదన్నారు. కోర్ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి నక్సలిజంపై మాట్లాడటమే కాకుండా, ఇప్పుడు లీకులు ఇవ్వడం దుర్మార్గమన్నారు.












Click it and Unblock the Notifications