మరో ధక్కా: 420 కేసులో జగన్ పార్టీ నేత అరెస్టు

తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేసిన కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త సిద్దార్థరెడ్డిని హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దశాబ్దంన్నర క్రితం ఒక ఫైనాన్స్ సంస్థను పెట్టి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, శఠగోపం పెట్టి వెళ్లిన పెద్ద పటోళ్ల సిద్దిరాంరెడ్డి (సిద్ధార్థరెడ్డి) మాయమయ్యాడు.
ఆ తర్వాత ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు నాయకుడిగా మళ్లీ నిజామాబాద్ జిల్లాకు చేరాడు. ఇటీవల పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయలక్ష్మి పర్యటన సందర్భంగా హల్‌చల్ చేసిన సిద్ధార్థరెడ్డి మోసం చేసిన కేసులో అరెస్టు అయ్యాడు.
1995లో పంచజన్య రికరింగ్ డిపాజిట్ పథకం పేరిట డిపాజిట్లు వసూలు చేసిన సిద్దార్థరెడ్డి ఆ తరువాత మాయమయ్యాడు. నిజామాబాద్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇది దెబ్బగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications