ఎలక్ట్రానిక్ విధానం ద్వారా 'అసెంబ్లీ', ఫస్ట్ టైమ్: స్పీకర్

Assembly
హైదరాబాద్: త్వరలో అసెంబ్లీలో పాలనా పనులన్నీ ఎలక్ట్రానికి విధానం ద్వారానే జరుగుతాయని సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారం వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కంప్యూటీకరణకు కేంద్ర ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని చెప్పారు. కంప్యూటీకరణకు రూ.16.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా అసెంబ్లీ కంప్యూటీకరణ జరుగుతోందని పేర్కొన్నారు.

ఇకపై శాసనసభ వ్యవహారాలన్నీ కంప్యూటీకరణ జరుగుతాయని, ఏడాదిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పీకర్ చెప్పారు. అలాగే వెబ్‌సైట్‌ను తెలుగులో ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యేలకు అందజేయాల్సిన వివిధ రకాల సమాచారం, పాలనాపరమైన కార్యకలాపాలన్నీ ఇక ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే నిర్వహించనున్నట్లు చెప్పారు.

పార్లమెంటుతో పాటు ఇతర రాష్ట్రాల అసెంబ్లీలు ఇక్కడ రూపొందించే విధానాన్ని అనుసరించనున్నాయని చెప్పారు. శాసన సభ్యుల జీతభత్యాలు, మాజీ సభ్యుల పింఛన్ల చెల్లింపు, ఆరోగ్యశ్రీ తదితర అన్ని పథకాలు, పాలనా అంశాలన్నింటిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని, కాగితం వినియోగం అనేది అసలు ఉండదని నాదెండ్ల చెప్పారు. పద్దెనిమిది నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.

ఇప్పటికి సగం మంది ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలు సమర్పించారన్నారు. నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈనెల 24న తుది విచారణ జరుగుతుందని స్పీకర్ తెలిపారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు - హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాల చారి, చిన్నం రామకోటయ్యకు సంబంధించి 24న జరుగనుందని, గంగుల కమలాకర్ విచారణకు ఇంకా కొంత సమయం పట్టవచ్చునన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+