బాబుపై అక్కడే దాడి, 'టి' ఇస్తే టిఆర్ఎస్ విలీనం: వివేక్

Vivek
న్యూఢిల్లీ: విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందనడం సరికాదని, గతంలో సీమంధ్రలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగిందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ మంగళవారం అన్నారు. ఆయన ఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను న్యూఢిల్లీలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే హైదరాబాదులో నివసించే ఇతర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులపై ఎలాంటి దాడులు జరగడం లేదన్నారు. తెలంగాణపై ఎలాంటి ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదన్నారు. రాష్ట్రం తప్ప ఎవరూ ప్యాకేజీలు కోరుకోవడం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతంలోనే నక్సలిజం మొదలైందని తాను షిండేకు చెప్పానన్నారు.

నీరు, విద్యుత్ తదితర సమస్యలపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవచ్చునన్నారు. విభజన ద్వారా మావోల ప్రభావం పెరుగుతుందనే వాదనలో వాస్తవం లేదని ఆయనకు చెప్పానన్నారు. సీమాంధ్రలోనే నక్సల్స్ ప్రభావం ఎక్కువన్నారు. చంద్రబాబు పైన గతంలో అక్కడే దాడి జరిగిందన్నారు. రాష్ట్రం విడిపితో ఇబ్బందులు ఉండవని చెప్పానన్నారు. తెలంగాణ ప్రస్తుతం కీలక దశలో ఉందన్నారు. గతంలో వేసిన ప్యాకేజీలు, కమిటీలు ఫెయిల్ అయ్యాయని, కొత్తగా ఇచ్చినా లాభం లేదన్నారు. సీమాంధ్ర ప్రజలు కూడా విభజన కోరుకుంటున్నారన్నారు.

సోనియా వద్ద రాజీనామా

తన రాజీనామా పత్రం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఉందని వివేక్ చెప్పారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో చేరుతారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తెరాసే విలీనం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో ఉన్నారనే విషయమై మాట్లాడేందుకు వివేక్ నిరాకరించారు.

కాగా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అంటోనీని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+