జగన్‌నుండి స్ఫూర్తి: లోకేష్ ఎద్దేవా, వారిపట్ల జాగ్రత్త: వర్ల

'వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి = ఎటిఎం దొంగతనాలు, నకిలీ నోట్లు, దొంగ బంగారం. పార్టీ అధ్యక్షుడిని చూసి వారు కూడా స్ఫూర్తి పొందినట్లున్నారు' అని నారా లోకేష్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ నేత సిద్దార్థ రెడ్డి దొంగ బంగారం కేసులో దొరికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా పలువురు పట్టుబడ్డారు.
దొంగనోట్ల వైయస్సార్ కాంగ్రెసు పట్ల జాగ్రత్త: వర్ల
దొంగలు, హంతకులు, దోపిడీదార్లు, దొంగనోట్లు, దొంగ బంగారం ముఠా నేతలు... ఇలా అందరికీ చిరునామాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మారిందని, ఆ పార్టీ పట్ల అఫ్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. సిద్దార్థ రెడ్డి దొంగ బంగారం కేసులో అరెస్టు కావడం ద్వారా జగన్ పార్టీ తీరు మరోసారి స్పష్టమైందన్నారు. అన్ని దారులూ రోమ్‌కే వెళ్తాయన్నది పాత సామెత అని, ఇప్పుడు నేరస్థులంతా లోటస్‌పాండుకే అనే కొత్త నానుడి వచ్చిందన్నారు.
రాజమండ్రి ఎటిఎం దొంగతనం కేసులో దొరికిన అనేక వాహనాలకు ద్వారంపూడి, జగన్ పేర్లతో స్టిక్కర్లు ఉన్నాయని పోలీసుల దర్యాఫ్తులో వెల్లడైందని, విశాఖలో దొంగనోట్ల మార్పిచి చేసిన ఆ పార్టీ నేత నాగమల్లేశ్వరి బండారం కూడా పోలీసులు బయటపెట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎంచుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications