గీతాంజలి హత్య: భర్తకు మరో మహిళతో సంబంధం?
చండీఘర్: గుర్గావ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ (సిజెఎం) రవనీత్ గార్గ్ భార్య గీతాంజలీ గార్గ్ మృతి కేసు సోమవారం మరో మలుపు తీసుకుంది. తన కూతురు హత్యకు రవనీత్ గార్గ్ వైవాహికేతర సంబంధం కారణమని, అతనిపై దానిపై అభియోగాలు మోపాలని గీతాంజలి తండ్రి అన్నారు. గార్గ్‌పై, అతని తల్లిదండ్రులపై గుర్గావ్ పోలీసులు హత్య, వరకట్నం వేధింపుల కింద కేసులు నమోదు చేశారు.
గీతాంజలి గతవారం హత్యకు గురైంది. ఆమె శవం పార్కులో కనిపించిన విషయం తెలిసిందే. తన కూతురు గత మూడు నెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతోందని, తన తల్లితో, ఇతర కుటుంబ సభ్యులతో ఫోన్లపై దానిపై తన కూతురు చర్చలు చేస్తూ వచ్చిందని గీతాంజలి తండ్రి ఓం ప్రకాష్ అగర్వాల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

తన కూతురు విద్యావంతురాలని, ఏం జరుగుతోందో తెలుసుకోగలదని, రనవీత్ వేరే వ్యక్తితో, బహుశా మరో మహిళతో గంటల తరబడి మాట్లాడుతుండడాన్ని గమనించిందని, ఆమె ఆ టెలిఫోన్ నెంబర్‌ను పట్టుకోలేకపోయిందని, దీంతో డిప్రెషన్‌కు గురైందని, రనవీత్, మరో మహిళ తన కూతురిని హత్య చేయడానికి కుట్ర చేశారని ఆయన అన్నారు.
గార్గ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించాలని అగర్వాల్ డిమాండ్ చేశారు. గీతాంజలి కూతుళ్లు ఆశ్మ, ఆదివాలను తమ కస్టడీకి అప్పగించాలని ఆయన కోరారు. గీతాంజలి కూతుళ్లను కలుసుకోవడానికి కోర్టు ఓ అధికారిని నియమించాలని ఆయన కోరారు.
తన పేరు మీదున్న 22 లక్షల రూపాయల విలువ చేసే కారు కూడా వారి వద్దని ఉందని, తాము ఎప్పటికప్పుడు డబ్బులు, ఇంటి సామాను ఇస్తూ వచ్చామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications