హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 కాపిటల్స్: హైద్రాబాద్‌పై సోనియాకు హర్షకుమార్ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Kumar writes letter to Sonia
న్యూఢిల్లీ: కేంద్రం రాష్ట్ర విభజనకు మొగ్గుచూపితే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు రెండు ప్రత్యేక రాజధానులు ఏర్పాటు చేసి, హైదరాబాదును శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు.

ఆంధ్ర ప్రాంత ప్రజలకు హైదరాబాదుతో బంధం పెనవేసుకుపోయిందని, ఇప్పుడు హైదరాబాదును వాళ్లకు కాదని తెలంగాణకు అప్పగిస్తే సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో తలెత్తే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాదును అందరికీ చెందేలా చూస్తుందన్న ఉద్దేశ్యంతోనే సీమాంధ్ర ప్రజలు ఇన్నాళ్లు శాంతిగా ఉన్నారని పేర్కొన్నారు.

అలాకాదని తెలంగాణకు మాత్రమే చెందేలా చేస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెసుకు కోలుకోలేనంద దెబ్బ తగులుతుందన్నారు. 1956 నుంచి హైదరాబాదు చాలా అభివృద్ధి చెదిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఐటి రంగం హబ్‌గా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరగడం వల్ల తూర్పు గోదావరి, గుంటూరు వంటి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలు తగ్గి హైదరాబాదులో పెరిగాయని రాశారు.

ప్రస్తుతం ప్రతిదానికి హైదరాబాదుపై ఆధారపడే పరిస్థితి సీమాంధ్రులకు నెలకొందన్నారు. అందువల్ల హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా చేయాలన్నారు. లేదంటే తమ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Amalapuram MP and Congress Party senior leader Harsha Kumar has wrote a letter to AICC president Sonia Gandhi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X