చంద్రబాబుకూ సెగ: సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా

కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దేవినేని ఉమా మహేశ్వర రావు, శ్రీరాం తాతయ్య, కందికొండ ప్రసాద్ రాజీనామా చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ గని రాజీనామా చేశారు. టిడిపి శాసనసభ్యులు లింగారెడ్డి, తంగిరాల ప్రభాకర్ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. గురువారం రాత్రి వీరు తమ రాజీనామా లేఖలను పంపించారు.
ఆంధ్ర ప్రాంత రైతులకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన అన్యాయానికి, సోనియా గాంధి చేసిన కుట్రకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. తెలిపారు. దేవినేని ఉమ గురువారంనాడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోస్తాలో ముఖ్యంగాకృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు.
ఆ తర్వాత పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కూడా తమ రాజీనామాలను పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలినవారు కూడా తమ తమ ప్రాంతాలకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ధూళిపాల్ల నరేంద్ర చౌదరి, పార్థసారథి, యరపతనినే శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు, శ్రీధర్, నక్కా ఆనందబాబు తదితరులు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు, గోవింద రెడ్డి, శమంతకమణి కూడా రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications