జగన్ కంచుకోట బద్దలు: వేంపల్లెలో తెలుగుదేశం గెలుపు

కడప జిల్లాల్లో వైయస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఇక పులివెందుల నియోజకవర్గం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీలో టిడిపి మద్దతుదారు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు రవి కుమార్ 2076 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
వేంపల్లెలో గత రెండుమూడు దశాబ్దాలుగా వైయస్ కుటుంబం అనుచరులే గెలుస్తూ వస్తున్నారు. టిడిపి మద్దతుదారుగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి శాసన మండలి సభ్యుడు సతీష్ రెడ్డికి సోదరుడు. కాగా వేంపల్లిలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్స్ కూడా సాగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కాగా మూడో దశ ఎన్నికలలోను హస్తం హవా కొనసాగిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు రెండువేలు, తెలుగుదేశం 1,980, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 1,300, తెలంగాణ రాష్ట్ర సమితి ఆరువందల నలభై స్థానాలను గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications