హైదరాబాద్‌పై 'చిరు' యత్నం, సోనియా ఎదుట మౌనం

సోనియా ముందు మంత్రుల మౌనం
సోమవారం లోకసభ ప్రారంభమయ్యాక సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆందోళన చేశారు. పోడియం వైపుకు దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. అయితే వారు ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జెడి శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఒక దగ్గర కూర్చొని మౌనంగా చూశారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎదుట ఎంపీల ఆందోళనకు మద్దతు ప్రకటించే సాహసం వారు చేయలేకపోయారు. కూర్చున్న సీట్లలో నుండి కూడా వారు లేచే ప్రయత్నం చేయలేదు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతం నుండి లోకసభకు కాంగ్రెసు నుండి పంతొమ్మిది మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందులో ఐదుగురు మాత్రమే నిరసన తెలిపారు. కొందరు సభ్యలు సభకు రాలేదు. మరికొందరు మంత్రిపదవుల్లో ఉన్నారు.
డిగ్గీపై పిట్టకథ
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండుతో ఎపిఎన్జీవోలు చేపట్టిన ర్యాలీలో ఒకరు ఆసక్తికరమైన పిట్ట కథ వినిపించారు. 'ఒక గ్రామంలో ఒక తండ్రి తన కుమారులకు ఆవు, కంబళి, చెట్టును ఇచ్చి సమానంగా పంచుకోమన్నాడు. ఎలా పంచుకోవాలో తెలియని స్థితిలో దిగ్విజయ్ వంటి పెద్ద మనిషి వద్దకు వెళ్తే... ఆవు ముందు భాగం ఒకరు, పాలిచ్చే వెనుక భాగం మరొకరికి, కంబలి ఉదయం ఒకరికి, రాత్రి ఒకరికి, చెట్టు మొదలు ఒకరికి, ఫలాలు తినే బాధ్యత ఇంకొకరికి అప్పగించారని' వ్యంగ్యంగా చెప్పారు.












Click it and Unblock the Notifications