వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమస్యలన్నింటికి కారణమే మీరు!: కిరణ్‌పై దామోదర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha andKiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యలున్నాయని, విభజిస్తే ఇంకా పెరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, ఆ సమస్యలన్నింటికి కారకులు ఎవరని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం మండిపడ్డారు. నలభై ఏళ్లకు పైగా పాలించిన సీమాంధ్ర ముఖ్యమంత్రులదా లేక పన్నెండేళ్లు పాలించిన తెలంగాణ ముఖ్యమంత్రులదా అని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు కారకులు ఎక్కువ కాలం పాలించిన సీమాంధ్రులే అన్నారు. విభజనపై పార్టీ అత్యున్నత సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని ఎలా కాదంటారని ప్రశ్నించారు.

టిజెఎప్ మీట్‌ది ప్రెస్‌లో దామోదర కిరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణకు ఎప్పుడు ఆభ్యంతర పెట్టలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడటం శోచనీయమన్నారు. కాంగ్రెసు పలు సందర్భాలలో తెలంగాణపై హామీ ఇచ్చిందని, ఇది అరవై ఏళ్ల కల అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన సమయంలో ముఖ్యమంత్రి ఇలా చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ అన్నారు.

ఉద్యమం తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు. తెలంగాణ కంటే దేశంలో ఇంకా 18 చిన్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదని, ఇతరుల భూభాగం తీసుకోవడం లేదన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమాల పురిటి గడ్డలు అన్నారు. హైదరాబాదుకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కులీకుతుబ్ షా, ఆసిఫ్ జాహీలు పాలించారని, తెలంగాణకు గొప్ప పోరాట చరిత్ర, సంస్కృతి ఉందన్నారు. నిజాంలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణదన్నారు.

తాము 1999లోనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ కోసం లేఖ ఇచ్చామన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులను ఇక్కడి నుండి పొమ్మనే హక్కు ఎవరికి, ఏ పార్టీకి లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా అందరికీ దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు సెటిలర్స్ కాదని, హైదరాబాదీలు, తెలంగాణ ప్రజలే అన్నారు. సమైక్యాంధ్రలో అరవై వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రజలు నష్టపోయారని చెప్పారు.

1972లో జై ఆంధ్ర అన్న వారు ఇప్పుడు సమైక్యాంధ్ర ఎందుకంటున్నారని ప్రశ్నించారు. నదీ జలాలు, విద్యుత్, విద్య తదితర సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. సమైక్యవాదం పట్ల తెలంగాణ ప్రజలకు అనుమానాలున్నందునే రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రం ఆస్తులు, వ్యాపారం కోసమా అని ప్రశ్నించారు. తమకు కావాల్సింది ఆత్మగౌరవం, స్వయంపాలన అన్నారు. అదిష్టానాన్ని ధిక్కరిస్తే చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమన్నారు.

నేను అంటే అహంకారం, మనం అంటే మమకారం అవుతుందని, నేను అంటే ఓటమికి, మనం అంటే విజయానికి సోపానమన్నారు. అధిష్టానం వల్లే మనం ఈ స్థాయికి వచ్చామని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు కలిసి పండుగలు జరుపుకుంటాయన్నారు. తెలంగాణ కల సాకారమవుతున్న నేపథ్యంలో అందరికి కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మేధావుల సలహాలు తీసుకుంటామన్నారు.

English summary
Deputy Chief Minister Damodara Rajanarasimha has lashed out at CM Kiran Kumar Reddy for his statement on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X