విభజనపై ఢిల్లీకి చంద్రబాబు: తర్వాత బస్సు యాత్ర

రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని రాష్ట్రపతి, ప్రధానిని బాబు కోరనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బస్సు యాత్ర చేపట్టనున్నారు. 'తెలుగు జాతి ఆత్మ గౌరవ పరిరక్షణ యాత్ర' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయని నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పెత్తనంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చారన్నారు. కాంగ్రెస్ డిల్లీలో ఎప్పుడు అధికారం వచ్చినా తెలగు జాతికి ఇదే దుస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమిస్తున్న సమయంలో కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరి చేసిందని, యాత్రగా వెళ్లాలనుకుంటున్నట్లు నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతున్న తరుణంలో కాంగ్రెసు పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా చేసిందని ఆయన అన్నట్లు సమాచారం. కాంగ్రెసు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అలాగే జరుగుతోందని ఆయన అన్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తాను పర్యటించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications