లారీని ఢీకొట్టిన కారు: టెక్కీ మృతి, ఇద్దరికి గాయాలు

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న 31 ఏళ్ల అభిమన్యు తన మిత్రులు ఉజ్వల్ వర్మ, గౌతం రెడ్డిలతో కలిసి శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై గచ్చిబౌలికి కారులో వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు హుందాయ్ వెర్నా.
అభిమన్యు ఓ వాహనాన్ని దాటేసే ప్రయత్నంలో కారును చిన్నమ్మ హోటల్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిమన్యు మరణించాడు. మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అభిమన్యు ఢిల్లీకి చెందినవాడు. కారు గౌతం రెడ్డికి చెందింది.
రంగారెడ్డి అనుమానాస్పద స్థితి లో ఓ గర్భిణి మృతి చెందింది. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న ఆమెను అదనపు కట్నం కోసం అత్తారింటి వారే హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మండలంలోని కనకమామిడికి చెందిన నర్సింహ(26) గత సంవత్సరం నవంబర్ నెలలో రాజేంద్రనగర్‌కు చెందిన విద్య అలియాస్ సుజాత(20)తో వివాహం జరిగింది.
నర్సింహ హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం డ్యూటీకి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని అదే గ్రామంలో ఉండే అక్కకు చెప్పేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న తల్లి, అక్కకు విషయాన్ని తెలిపాడు.












Click it and Unblock the Notifications