విభజన: సోనియాపై సిఎం ఫైర్, వైయస్‌పై కెవిపి వివరణ

సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితికి కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. తెలంగాణపై తాము లేఖ ఇచ్చామని, దానిని తాము వెనక్కి తీసుకోవడం లేదని అయితే, నిర్ణయం తీరునే తాము గర్హిస్తున్నామన్నారు. సీట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకున్న వారు విదర్భను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సర్వనాశనం చేస్తున్నారన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారన్నారు. నలభై ఏళ్ల క్రితం టిపిఎస్ తెలంగాణ కోసం ఉద్యమించి పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీని విలీనం చేసుకున్నారని, ఇటీవల ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడ తెరాస విలీనం కోసం విభజనపై నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.
వైయస్ ఏం చెప్పారంటే...: కెవిపి
తెలంగాణ కోసం యూపిఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాలని 2009లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని కాంగ్రెసు ఎంపి కెవిపి రామచంద్ర రావు అన్నారు. టిడిపి నేత సభ్యులు సిఎం రమేష్ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను తాము అంగీకరించమన్నారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి ప్రకటనపై వివరణ ఇస్తారనుకున్నామని కానీ, చర్చకు దారి తీసిందన్నారు.
2004లో రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసేందుకు తెరాస, కాంగ్రెసుల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. 2009లో వైయస్ భాగస్వాములతో చర్చించాలని చెప్పారన్నారు. ఆ కారణంగానే రోశయ్య కమిటీ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా కెవిపి.. రోశయ్య కమిటీ ప్రతిపాదన చదివి వినిపంచారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించారనడం సరికాదన్నారు. 2004లో ఎన్డీయే విదర్భ సాధ్యం కాదని చెప్పిందన్నారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను సభలో చర్చకు పెట్టాలని కోరారు. 11 నెలల తర్వాత శ్రీకృష్ణ కమిటీ సవివరంగా నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని ఉన్న ప్రాంతంలో ఎప్పుడైనా ఉద్యమాలు వచ్చాయా అన్నారు. తాను చెప్పిన వివరాలు ఎవరైనా తప్పు అంటే దేనికైనా సిద్ధమన్నారు. తెలంగాణ అనేది చరిత్రలో ఉందా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications