బాబుకు అలవాటే, టిపై రేపు వెనక్కెళ్లొచ్చు: లగడపాటి

lagadapati rajagopal and chandrababu naidu
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మాటలు, విధానాలు మార్చటం కొత్త కాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం విమర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును గతంలో తెగిడిన బాబు, 2004 తర్వాత ఆయన పాదాలు మొక్కుతున్నారని, గతంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న బాబు, ఆ తర్వాత దానికి దూరంగా జరిగారన్నారు.

ఇప్పుడు అదే విధంగా తెలంగాణకు వ్యతిరేకమని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. విభజనకు వ్యతిరేకమని చెప్పాకనే బాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలన్నారు. బాబు స్పష్టంగా సమైక్య విధానం అవలంభించాలన్నారు. టిడిపి ఎంపీలు సభలో సగం దారికి వచ్చారని, ఇంకా పూర్తిగా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎంపీలు సభలో తమతో పాటు నిరసన తెలుపుతున్నప్పటికీ సీమాంధ్రకు న్యాయం అంటున్నారే తప్ప సమైక్యం అనడం లేదన్నారు.

అయితే వారి ఆందోళనలో విభజన జరగకూడదనే ఉద్దేశ్యం కనిపిస్తోందన్నారు. విభజన ద్వారా తెలుగు ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని.. అలాంటప్పుడు ఏ నిర్ణయం పైనా శిలాశాసనాలు ఉండవని, ప్రజా శాసనాలు మాత్రమే ఉంటాయన్నారు. విభజన ద్వారా సీమాంద్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఇప్పుడిప్పుడే అన్ని పార్టీలకు అర్థమవుతోందన్నారు.

తాను అన్ని పార్టీలకు విభజన అంశంపై లేఖ రాశానని చెప్పారు. తమ పార్టీ విభజనపై ఈ రోజు వెనక్కి వెళ్లకపోయినా.. రేపు వెళ్లవచ్చునన్నారు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. కాంగ్రెసు ప్రజల పార్టీ అని, ప్రజల మనోభావాలను అది పరిగణలోకి తీసుకుంటుందన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీల పాపముందన్నారు. ఒక్క మజ్లిస్, సిపిఎం మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నాయన్నారు.

తాము అధిష్టానం మనసును మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం స్పష్టంగా నిలబడితే తాను పాదాభివందనం చేస్తానన్నారు. మొదటి నుండి తాము సమైక్యవాదం వినిపిస్తున్నామని, తమ ధ్యేయం సమైక్య రాష్ట్రం మాత్రమే అన్నారు. ఎకె ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చే వరకు తెలంగాణ ప్రక్రియ ముందుకు జరగదన్నారు. తాము ఆందోళన చేయగానే అధిష్టానం కమిటీ వేసిందన్నారు. మిగతా పార్టీలు కూడా అలాగే వేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+