చూసి నేర్చుకోండి: జగ్గారెడ్డికి సమైక్యవాదుల మద్దతు

జగ్గారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన నేత అయినప్పటికీ సమైక్య రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అందుకే ఆయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జగ్గారెడ్డిని చూసి తమ ప్రాంత ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గజల్ శ్రీనివాస్ కచేరి జరగనుంది. కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టనున్నారు.
సమైక్యాంధ్ర కోసం నిరవధిక దీక్ష చేస్తున్న మంత్రి తోట నర్సింహం సతీమణి తోట వాణి దీక్ష సోమవారంతో మూడో రోజుకు చేరుకుంది. తాము ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదును వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. పదమూడో రోజు కూడా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి నుండి ఎపిఎన్జీవోలు సమ్మెకు దిగనున్నారు. పలు జిల్లాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్ల ప్రసారాలను నిలిపి వేశారు.
లగడపాటి ఇంట్లో భేటీ
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఇంట్లో సోమవారం ఉదయం భేటీ అయ్యారు. సభలో సమైక్యాంధ్ర కోసం ఏం చేయాలనే దాని పైన వారు చర్చించారు. నేడు లోకసభలో సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో లోకసభకు హాజరు కావాలని ఎంపీలకు కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications