ఏదో రగిలిస్తుంటారు, హైద్రాబాదీనే కానీ టి వద్దు: ఏచూరి

నలభై ఏళ్లుగా ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం కనుగొనలేకపోయారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే పరిష్కారమని దివంగత ఇందిరా గాంధీ భావించారన్నారు. విభజన వద్దని స్పష్టంగా చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం మాత్రమేనన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని 1928లోనే మోతీలాల్ నెహ్రూ కమిటీ చెప్పిందని, అదే నిర్ణయాన్ని మనం స్వాతంత్రం వచ్చాక అమలు చేశామని, అందుకు అనుగుణంగానే ఎపి ఏర్పడిందన్నారు.
తాను హైదరాబాదినే అని అయినా తనకు విభజన ఇష్టం లేదన్నారు. 1969లో జరిగిన ఉద్యమంలో తన చదువు దెబ్బతిందన్నారు. కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయం పునరాలోచించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎపి నుండి వచ్చిన ఎంపీలు లేకుంటే యూపిఏ ప్రభుత్వం లేదని, అలాంటి రాష్ట్రంపై మీరెందుకు దృష్టి సారించడం లేదన్నారు. విభజన నిర్ణయానికి ముందు హోమ్ వర్క్ చేయకపోవడం సరికాదన్నారు. తెలంగాణపై నిర్ణయం పచ్చి అవకాశవాదంతో తీసుకుందన్నారు.
ఉద్యమాలకు ఊపు: తృణమూల్ కాంగ్రెస్
తెలంగాణపై కేంద్రం నిర్ణయం దేశవ్యాప్తంగా ఉద్యమాలకు ఊపునిస్తోందని తృణమూల్ కాంగ్రెసు ఎంపి శేఖర్ రాయ్ అన్నారు. విభజనపై మరోసారి పునరాలోచించాలన్నారు. 1947లో దేశ విభజన పర్యవసనాలను అనుభవిస్తున్నామన్నారు. గూర్ఖాలాండుకు ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో చెప్పాలన్నారు. అసోంలో ప్రత్యేక ఉద్యమాలు జరుగుతున్నాయని, బెంగాల్లో డార్జిలింగులో ఉద్యమం ఉధృతంగా సాగుతోందన్నారు. కేంద్రం వైఖరి దేశవ్యాప్తంగా అనేక డిమాండ్లకు ఊతమిచ్చిందని, ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. విభజనపై పునరాలోచించాలన్నారు.
ప్రాంతీయవాదమనే నిప్పుతో చెలగాటం: అన్నాడిఎంకె
కాంగ్రెసు పార్టీ ప్రాంతీయవాదమనే నిప్పుతో చెలగాటమాడుతోందని ఎన్నాడిఎంకె ఎంపి మైత్రేయన్ అన్నారు. తెలంగాణపై నిర్ణయం రాజకీయ అవసరాల కోసమా లేదా నిబద్దతతో తీసుకున్నదా చెప్పాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications