కృష్ణుడి వేషంలో సభకు శివ ప్రసాద్, హరికృష్ణ నినాదాలు

నెత్తిన కిరీటం, ఓ చేతిలో పిల్లన గ్రోవి, మరో చేతిలో సుదర్శన చక్రంతో సభకు వచ్చారు. పిల్లన గ్రోవి ఊదుతూ వెల్‌లోకి చొచ్చుకు పోయారు. సభలోనే ఆయన పద్యాలు, పాటలు పాడుతూ నిరసన తెలిపారు. నాడు కౌరవుల వద్దకు కృష్ణుడు దూతగా వెళ్లారని, నేడు తాము సీమాంధ్ర ప్రజల కోసం దూతగా వచ్చానని ఆయన చెప్పారు.
సభ రెండు గంటల వరకు వాయిదా పడిన అనంతరం శివ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అగ్ని గుండమవుతుందని, దానిని కాపాడాలని తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పేందుకు ఇలా కృష్ణుడి వేషంలో వచ్చానని తెలిపారు. సభలో సున్నితమైన సమస్యను కళారూపం ద్వారా చెప్పే ప్రయత్నం చేశానన్నారు. తన వినూత్న నిరసనకు సభలో అందరూ కాసేపు తదేకంగా చూశారని, పలువురు నేతలు కంగ్రాట్స్ చెప్పారన్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ సభలో నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడాలంటూ ఆయన పార్టీకి చెందిన మిగతా ఎంపీలతో గొంతు కలిపారు. కాగా రాజ్యసభ మూడోసారి అరగంట వాయిదా పడింది.












Click it and Unblock the Notifications