మోడీ కన్నా మేమే బెట్టర్, మేమే ఆదర్శం: కిరణ్ రెడ్డి

kiran kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీపై, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై, ప్రధాని మన్మోహన్ సింగ్‌పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన విమర్శలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. గుజరాత్‌లో కన్నా తమ రాష్ట్రంలోనే పథకాలు ఎక్కువగా, బాగా అమలవుతున్నాయని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందుందని ఆయన అన్నారు. మనమే అందరికీ ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు మన పథకాలను అమలు పరిచేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన అన్నారు. బంగారుతల్లి తదితర పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నైపుణ్యాల అభివృద్ధి గురించి మోడీ మాట్లాడిన విషయాన్ని ఆయన పూర్వపక్షం చేసే ప్రయత్నం చేశారు.

రెండేళ్లలో గుజరాత్‌లో 52 మందికి నైపుణ్యం అభివృద్ధి చేసిందని, తమిళనాడు గురించి కూడా మోడీ మాట్లాడారని, లక్షా అరవై వేల మందికి నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇచ్చిందని, తాము నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి 3.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇది దేశంలోనే సగం కన్నా ఎక్కువని ఆయన వివరించారు.

సరిహద్దు సమస్యలు చాలా సున్నితమైవని, సరిహద్దు సమస్యలపై అంతర్గత విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ సరిహద్దు సమస్యలపై మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పరిష్కారం దొరకదని ఆయన అన్నారు. అన్ని దేశాల వద్ద ఆధునిక ఆయుధాలున్నాయని ఆయన చెప్పారు. తొందరపడి, రెచ్చగొట్టే చర్యల వంటి పొరపాటు ప్రమాదకరమైందని ఆయన అన్నారు. విపరీతమైన పదవీకాంక్షతో నరేంద్ర మోడీ అబద్ధాలు మాట్లాడారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+