విభజన ఎలా చేయకూడదో చూపించారు: జవదేకర్

Prakash Javadekar
న్యూఢిల్లీ: తెలంగాణపై బిల్లు తేవాలనుకుంటే ఈ సమావేశాల్లో మీరు తేగలరని బిజెపి సభ్యుడు ప్రకాష్ జవదేకర్ కాంగ్రెసును ఉద్దేశించి అన్నారు. విభజన ఎలా చేయకూడదనే దానికి కాంగ్రెసు తీరు నిదర్శనమని ఆయన అన్నారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై చర్చలో ఆయన పాల్గొన్నారు. సామరస్య పూర్వకంగా విభజన జరిగితే సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడితే రెండూ అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి నిబద్ధత, సిద్ధాంతం లేవని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెసు స్వార్థపూరితంగా వ్యవహరించిందని ఎజిపి సభ్యుడు వీరేంద్ర ప్రసాద్ విమర్శించారు. తెలంగాణ నిర్ణయానికి ముందు అసోం ప్రశాంతంగా ఉందని, తెలంగాణపై నిర్ణయం తీసుకోగానే ప్రత్యేక ఉద్యమాలు లేచాయని ఆయన అన్నారు. బోడోలాండ్, కర్జీఅంగ్లాంగ్ ప్రత్యేక ఉద్యమాలు ఎగిసి పడ్డాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితి రెండు ప్రాంతాల్లో అభద్రతా భావాన్ని పెంచిందని కాంగ్రెసు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని, ఇప్పుడు బిజెపి కాంగ్రెసును విమర్శిస్తోందని ఆయన అన్నారు. బిజెపి తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో తెలంగాణ ఇస్తామని చెప్పిందని ఆయన అన్నారు. కాంగ్రెసు చేసిన తప్పేమిటని ఆయన అడిగారు.

ఆంధ్రప్రదేశ్ విభజన మంచిది కాదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్వాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ఎందుకు జరుతోందని, దాని వెనక ఉన్న ఉద్దేశ్యాలేమిటని ఆయన అడిగారు. తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో 15 సీట్లు గెలిచే ఉద్దేశంతో కాంగ్రెసు రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆయన విమర్శించారు. భారతదేశాన్ని కాంగ్రెసు చిన్న దేశాలుగా విభజిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన జరుగుతోందని ఆయన అన్నారు, ఎన్నికలు, సీట్లు, ఓట్ల కోసం అగ్ని రాజేస్తున్నారని ఆయన అన్నారు.

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, ఈ సిద్ధాంతం ఆధారంగానే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నట్లు బిఎస్పీ సభ్యుడు వీర్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని, మహారాష్ట్ర విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+