తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాగబద్దంగానే చేస్తాం: చిద్దూ

చత్తీస్‌గడ్, జార్ఖండ్ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ప్రక్రియ పూర్తికి చాలా సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల పరిమితిని చెప్పలేనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అడుతున్నారని, అందరినీ సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తీసుకున్ననిర్ణయాన్ని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయని, ఎంతగా విమర్సలు చేస్తే తమ పార్టీ అంతగా బలం పుంజుకుంటుందని ఆయన చెప్పారు. విభజనకు ముందే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.
తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు రెండు సమావేశాలు ఏర్పాటు చేశానని, కొన్ని పార్టీలు తెలంగాణపై నిర్ణయం చెప్పాయని, కొన్ని పార్టీలు చెప్పలేదని ఆయన అన్నారు. పార్టీలు తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గాయని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని సామాజిక, ఆర్థిక విషయాలను ప్రస్తావించిందని చెప్పారు. జలవనరులు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు గురించి కూడా శ్రీకృష్ణ కమిటీ వివరించిందని ఆయన అన్నారు. రాజ్యాంగబద్దంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చిదంబరం చెప్పారు.
మొత్తం ప్రక్రియలో చివరకు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామికమవుతుంది, తాము తీసుకుంటే తప్పెలా అవుతుందని ఆయన అడిగారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. నిర్ణయం తీసుకునే విషయంలో ప్రతి పార్టీకి తనదైన ప్రక్రియ ఉంటుందని ఆయన అన్నారు. అన్ని సమస్యలను తాము పరిశీలిస్తామని, పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తాము ప్రతిపాదించామని, దానిపై సూచనలు వస్తే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications