డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం: తెలుగులోనే హరికృష్ణ

తెలుగులోనే మాట్లాడేందుకు హరికృష్ణ పట్టు బట్టారు. బిజెపి సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు మద్దతు పలికారు. చట్టసభల్లో తెలుగులో మాట్లాడే హక్కు సభ్యులకు ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియాలి కదా అని చైర్ అన్నారు. అనువాదకుడి కోసం ముందుగానే మాతృభాషలో మాట్లాడుతానని చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి తన రాష్ట్రానికి వస్తుందని అనుకోలేదని హరికృష్ణ అన్నారు. రాష్ట్ర విభజనపై అర్థరాత్రి బ్రిటిష్ వాళ్లు అర్థరాత్రి స్వాతంత్ర్యం ప్రకటించినట్లుగా ప్రకటన చేశారని ఆయన విమర్శించారు.
తన తండ్రి ఎన్టీ రామారావు కృష్ణా జిల్లాలో పుట్టాడని, హైదరాబాదుకు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డామని ఆయన చెప్పారు. తాము హైదరాబాద్ వచ్చి 60 ఏళ్లు అవుతోందని ఆయన అన్నారు. చాలా దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఎందరో గొప్పవాళ్లు పుట్టిన గడ్డ తనదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ పెద్ద మనిషి గౌరవాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. తమ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్ర్రెసు ముందుకు సాగుతోందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజన తేలికైన విషయం కాదని, ప్రజల్లోని భయాలనూ అభద్రతా భావాన్ని తొలగించాలని డిఎంకె సభ్యురాలు కనిమొళి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై జరిగిన చర్చలో ఆమె సోమవారం పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో విభజన జరగాలని ఆమె అన్నారు. ప్రజలు, విద్యార్థులు అభద్రతా భావానికి, ఆందోళనకు గురవుతున్నారని ఆమె అన్నారు. విభజనపై అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని ఆమె అన్నారు












Click it and Unblock the Notifications