హైద్రాబాద్‌లో మోడీ అబద్దాలు, ఆంటోనీకి చెప్పండి: డిగ్గీ

తెలంగాణపై ప్రధాన ప్రతిపక్షం బిజెపిది ద్వంద్వ వైఖరి అన్నారు. తెలంగాణ, సీమాంధ్రపై మోడీ చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు. పదే పదే తాము తెలంగాణకు అనుకూలమని బిజెపి ఇప్పుడు చెబుతోందని కానీ, గతంలో ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని నాటి ఎంపి నరేంద్ర కలిసినప్పుడు తెలంగాణ ప్రసక్తే లేదని చెప్పారని గుర్తు చేశారు.
మళ్లీ కొంతకాలానికి తాము అనుకూలమని చెప్పారన్నారు. మోడీ మాటల్లో కొత్తదనమేమీ లేదన్నారు. ఎపిఎన్జీవోల సమ్మెపై స్పందిస్తూ... వారు సమ్మె విరమించాలని కోరారు. సమ్మెతో సాధించేదేమీ లేదన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమన్నారు.
వారితో చర్చకు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని సూచించారు. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించి ఎకె ఆంటోనీ కమిటికీ అన్ని సమస్యలను తెలియజేయాలన్నారు. వారితో తాము ఇవాళ రేపట్లో చర్చలు జరుపుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications