రైల్లో ఏడేళ్ల బాలికపై ఘోరం, రూ.10 ఇచ్చి పరారైన వ్యక్తి

ఆమెపై అత్యాచారానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి, రైలు బిలాస్‌పూర్ చేరుకున్న తర్వాత ఆమెకు రూ.10 ఇచ్చి స్టేషన్‌లో వదిలి పెట్టి వెళ్లాడు. పట్టణంలోని కొట్వాలీ పోలీసు స్టేషన్ ప్రాంతంలోని భక్త కన్వరమ్ మార్కెట్ వద్ద తీవ్రమైన గాయాలతో, విపరీతమైన రక్తస్రావంతో ఉన్న బాలికను పోలీసులు గుర్తించారు.
ఆమెను శనివారం చికిత్స నిమిత్తం చత్తీస్‌గఢ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా పరీక్షల్లో తేలినట్లుగా పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం రైలులో ఉన్న బాలిక టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక పోలీసులకు చెప్పింది.












Click it and Unblock the Notifications