వెనక్కి తగ్గం: టీపై డిగ్గీ, సీమాంధ్ర నేతల నోళ్లకు తాళాలు

ఆంటోనీకి చెప్పండి: బొత్స
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెసు అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీకి ముందు సీమాంధ్ర, తెలంగాణ పార్టీ ప్రజాప్రతినిధులు తమ వాదనలు వనిపించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారు. ఆయన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని ఆయన సోమవారంనాడు అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు.
ఆందోళన సాగిస్తాం: టిడిపి
కాగా, రాష్ట్ర విభజనపై కాంగ్రెసు తీరుకు నిరసనగా పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామని సీమాంధ్ర తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్, సుజనాచౌదరి, నందమూరి హరికృష్ణ చెప్పారు. రాజ్యసభలో రాష్ట్ర పరిణామాలపై జరిగిన చర్చకు కేంద్ర మంత్రి చిదంబరం సమాధానం ఇచ్చిన తర్వాత వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యసభలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వలేదని వారన్నారు.
రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టేందుకు కేంద్రం ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని సిఎం రమేష్ విమర్సించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి వేడుక చూస్తున్నారని కాంగ్రెసు వైఖరిని రమేష్ తప్పు పట్టారు.
ఏ శక్తులూ ఆపలేవు: ప్రసాద్ కుమార్
ఎన్ని శక్తులు అడ్డువచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగబోదని తెలంగాణకు చెందిన మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని, త్వరలోనే ఉద్యమం చల్లారుతుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications