వెనక్కి వెళ్లం: టిపై గవర్నర్‌ను కల్సిన మంత్రుల భార్యలు

ministers wifes
హైదరాబాద్: తాము హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేమని మంత్రి సాకె శైలజానాథ్ సతీమణి మోక్ష మంగళవారం అన్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రుల సతీమణులు ఈ రోజు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

విభజన జరిగితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని సాకె మోక్ష అన్నారు. తమ ప్రాంతంలో విద్యాసంస్థలు, కంపెనీలు లేవన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన జరిగిందన్నారు. ఎవరిని అడిగి రాష్ట్రాన్ని విభజించారని ప్రశ్నించారు. తమ పిల్లలు ఎక్కడ చదవాలని, ఎక్కడ ఉద్యోగాలు సంపాదించాలని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల బాధ చెప్పాలనే తాము గవర్నర్‌ను కలిశామన్నారు.

ఈ రాష్ట్ర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. విభజన జరిగితే తాము మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వెనక్కి వెళ్లేందుకు సిద్దంగా లేమన్నారు. విభజన వద్దని తాము గవర్నర్‌ను కోరామని సామినేని విమల చెప్పారు.

ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని దెబ్బతీయడం సరికాదని మాజీ మంత్రి మారెప్ప సతీమణి రాణి అన్నారు. విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతానికి సంపూర్ణ ప్యాకేజీ వస్తుందని తమకు ఏమాత్రం నమ్మకం లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+