సమైక్యానికి పార్టీ: రౌతు, తెలియదు: శైలజానాథ్

న్యాయం జరగకపోతే పార్టీని వీడుతామని హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చ జరగకపోవడం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయన రౌతు సూర్యప్రకాష్ వెల్లడించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆయన చెప్పారు. తిలా పాపం తలా పిడికెడు అనే విధంగా రాజకీయ పార్టీలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయని ఆయన అన్నారు. తమ భవిష్యత్తు ప్రజలతో ముడిపడి ఉందని అన్నారు.
కాగా, సమైక్య ఇందిరా కాంగ్రెసు పార్టీ గురించి తనకు తెలియదని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. ఆంటోనీ కమిటీ ముందుకు సీమాంధ్ర మంత్రులు వెళ్తారనే సమాచారం లేదని, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సమైక్య ఉద్యమం చేస్తున్న పార్టీలన్నీ రాష్ట్రాన్ని విభజించాలనే కోరాయని ఆయన గుర్తు చేశారు. ఏ పార్టీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయలేదని ఆయన చెప్పారు.
రాజీనామాలు కాదు, శానససభలో తెలంగాణ తీర్మానం వస్తే ఏం చేయాలనే విషయంపై ఆలోచించాలని ఆయన అన్నారు. తిరుమలలో తమ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరవచ్చు గానీ అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications