విషాదం: బ్రీతింగ్ వ్యాయామం చేస్తూ టెక్కీ మృతి

కొండాపూర్ ఆనందనగర్‌లోని తులీప్ లీ పార్క్ గృహ సముదాయంలో నివాసం ఉంటున్నాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తు్న సోదరుడు కళ్యాణ చక్రవర్తి గురువారం పృథ్వీరాజ్ ఇంటికి వచ్చాడు. సాయంత్రం ఇద్దరు కలిసి తులీప్ లీపార్కులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ వారు బ్రీతింగ్ వ్యాయామం చేశారు.
కొద్దిసేపటికి చూస్తే కళ్యాణ చక్రవర్తికి సోదరుడు పృథ్వీరాజ్ కనిపించలేదు. అనుమానం వచ్చి స్మిమ్మింగ్ పూల్‌లో చూస్తే మునిగిపోయి కనిపించాడు. వెంటనే అతన్ని మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
బ్రీతింగ్ వ్యాయామం చేస్తుండగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి పృథ్వీరాజ్ మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం పోస్టు మార్టం చేసి బంధువులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications