హైదరాబాద్‌ను యుటిగా ఒప్పుకోం: సోనియాతో అసద్

కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకున్న తర్వా మళ్లీ బుధవారం తొలిసారిగా ఆయన సోనియాను కలుసుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచనను ఆయన ముందు సోనియా పెట్టినట్లు సమాచారం. రాయల తెలంగాణకు తమకు అభ్యంతరం లేదని అసదుద్దీన్ చెప్పినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌ను యుటీ చేయడానికి మొదటి నుంచి ఓవైసీ వ్యతిరేకత చూపుతున్నారు. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎంఐఎంకు రాజకీయ మనుగడ ఉండదని వారి ఆలోచన. రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని, రాయల తెలంగాణ ఇచ్చినా అభ్యంతరం లేదని, లేదా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఆయన చెప్పినట్లు తెలియవచ్చింది.
గతంలో నియమించిన జస్టిస శ్రీకృష్ణ కమిటీకి ఎంఐఎం ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటామని అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు తెలియవచ్చింది. సోనియాతో జరిగిన సమావేశ వివరాలను తాను బయటకు చెప్పబోనని ఆయన మీడియాతో అన్నారు.












Click it and Unblock the Notifications