అనుమానంపై అవమానం: భార్యను చంపి ఆత్మహత్య

హైదరాబాదులోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టలోని శ్రీనివాస నగర్‌కు చెందిన డ్రైవర్ ఎన్‌కె అజ్మత్ బోరబండకు చెందిన లాల్ మహ్మద్ కూతురు గౌసియా బేగంను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం వారిద్దరు మీయాపూర్ సాయినగర్‌లో ఉంటున్నారు. గౌసియా బ్యుటిషియన్‌గా పనిచేస్తోంది. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గౌసియా అనుమానించి మంగళవారం రాత్రి నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గౌసియా తన అక్క అస్మా బేగంకు చెప్పింది.
గౌసియా తీరుకు అజ్మత్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గొంతు నులిమి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత చీరతో తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అక్క ఆస్మాబేగం ఫోన్ చేసినా గౌసియా పలుకలేదు. దీంతో అనుమానం వచ్చి తమ్ముడు ముస్తాఫాను గౌసియా ఇంటికి పంపించింది. అతను వచ్చేసరికి వారిద్దరు శవాలే కనిపించారు.












Click it and Unblock the Notifications