వెనక్కి పోదు, ముందుకు సాగకపోవచ్చు: టీపై చిరు

Chiranjeevi
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం వెనక్కి పోతుందని అనుకోవడం లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. అలాగే, రాష్ట్ర విభజనపై మరో కమిటీని ఏర్పాటు చేస్తారని కూడా అనుకోవడం లేదని, ఆంటోనీ కమిటీయే చివరిదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అనంతరం ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు సమన్యాయం చేయాలని తాను సోనియాను కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగకపోవచ్చునని ఆయన అన్నారు.

హైదరాబాదులాంటి నగరాన్ని నిర్మించుకోవడానికి తరాలు పడుతుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే సమన్యాయం జరుగుతుందని భావిస్తే ఆలాగే చేస్తారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. జల, ఉద్యోగ విషయాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని, ప్రజలతో ఉంటానని ఆయన అన్నారు.

కాంగ్రెసు అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళను బాధ్యతగా తీసుకుని ఈ తీవ్రతను తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. వాస్తవ పరిస్థితులను వివరించినట్లు తెలిపారు విభజన నిర్ణయానికి సీమాంధ్ర ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని, కోపోద్రిక్తులయ్యారని, తన దిష్టిబొమ్మను తగులబెట్టినా తాను తీవ్రంగా తీసుకోబోనని, అలా తగులబెట్టడం షాక్ అబ్జార్వర్‌గా పనిచేస్తుందని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. త్వరలో సమన్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. సినిమాలను, రాజకీయాలను తాను కలిపి చూడబోనని ఆయన చెప్పారు. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతనే విభజనకు తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగకపోవచ్చునని ఆయన అన్నారు. సోనియాతో చిరంజీవి భేటీలో అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+