దీక్షపై సమాచారంలేదు: జైలు వర్గాలు, స్టార్టయింది: పార్టీ

కాగా, ఖైదీల నిరసనలు, నిరహార దీక్షలు జైలు మాన్యువల్‌కు విరుద్దమని జైలు సూపరింటెండెంట్ సైదయ్య చెప్పారు. రిమాండ్‌లో ఉన్న ఖైది తప్పనిసరి జైలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. దీక్ష కోసం అనుమతి కోరినా ఆంగీకరించడం కుదరదని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఒకవేళ బలవంతంగా నిరహారదీక్ష చేస్తే జైలు మాన్యువల్ ప్రకారం నేరంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
గుత్తా ఫైర్
వైయస్ జగన్ దీక్ష పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆయనను వెంటనే కడప, విశాఖ లేదా రాజమండ్రి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. జగన్ దీక్ష చేస్తోంది సమన్యాయం కోసమా లేక సమైక్యత కోసమా చెప్పాలన్నారు.
జగన్ దీక్ష చేస్తున్నారు: పార్టీ
చంచల్‌గూడ జైలులో ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి నిరవధీక దీక్షను ప్రారంభించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications