తెగించి ఉన్నాం.. వదలం, గోచీయే ఉంది: కోదండ వార్న్

ఈ శాంతి ర్యాలీతో హైదరాబాద్ దద్దరిల్లుతుందన్నారు. సీమాంధ్ర నాయకులు ఢిల్లీ పెద్దలకు లేఖలు రాయడం సరికాదని, సమస్యకు పరిష్కారం చూపించాలని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడాన్ని ఉద్దేశించి చెప్పారు. రాష్ట్రం విడిపోతే ఎలా నష్టం జరుగుతుందో ఏ ఒక్క సీమాంధ్ర నాయకులు చెప్పడం లేదన్నారు. సమైక్య ఉద్యమం తెలంగాణపై ఓ దాడిగా అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కడా కలిసి ఉండాలని ఉద్యమం జరగలేదన్నారు.
సభపై పునరాలోచించుకోవాలి: గండ్ర
సెప్టెంబర్ 7న హైదరాబాదులో ఎపిఎన్జీవోలు నిర్వహించబోయే సభ పైన పునరాలోచించుకోవాలని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వేరుగా అన్నారు. ఎపిఎన్జీవోల సభ పైన ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని, సెప్టెంబర్ 1న తలపెట్టిన దీక్షను సీమాంధ్ర నేతలు వాయిదా వేసుకోవాలని కోరారు. విభజన విషయంలో కాంగ్రెసు, ప్రధానుల పైన నిందలు వేయడం సరికాదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెసు నిర్ణయించిందన్నారు.
సభకు కెసిఆర్ కసరత్తు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చే నెల 6న కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తెరాస వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని, బిల్లు త్వరగా పెట్టించాలనే డిమాండుతోనే సభ పెడుతున్నట్లు ఆయన వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications