నిర్ణయం వెనక్కెళ్లదని తెల్సు: మల్లు, రిజైన్లపై మంత్రులు

తన ప్రతిపాదన పైన ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. అలా చేయడం వల్ల పార్టీకి కూడా ప్రయోజనమే అన్నారు. ప్రజా ఉద్యమాన్ని చూసి విభజన నిర్ణయం ఆగుతుందని అందరూ చెబుతున్నారని కానీ, నిర్ణయం వెనక్కి వెళ్లదనే విషయం అందరికీ తెలుసునన్నారు.
రాజీనామాకు సిద్ధం: కావూరి, సాయి ప్రతాప్
రాజీనామాలతో విభజన ఆగిపోతుందంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, సాయి ప్రతాప్‌లు చెప్పారు. ఎపిఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులు కేంద్రమంత్రులతో ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. వారి రాజీనామాకు ఉద్యోగులు పట్టుబట్టారు.
రాజీనామాలతో లాభమేమిటని నేతలు.. ఉద్యోగులను ప్రశ్నించారు. రాజీనామా చేస్తే పరిస్థితి తీవ్రత, సమైక్య ఉద్యమాన్ని ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకు వెళ్లవచ్చునన్నారు. దానికి కేంద్రమంత్రులు, ఎంపీలు ఇవాళ, రేపు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారుకు చెప్పారు. అనంతరం కావూరి, సాయి ఇతర నేతలు మాట్లాడుతూ.. అవసరమైతే రాజీనామాకు సిద్ధమన్నారు. రాజీనామాలు చేయకుంటే చట్టసభల్లో తమ వాదన వినిపించవచ్చునని ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications