బాబు టూర్‌కు కౌంటర్: సీమాంధ్రలో షర్మిల బస్సుయాత్ర

సెప్టెంబర్ 2వ తేదిన కడప జిల్లాలోని వేంపల్లి మండలం ఇడుపులపాయ మండలంలోని వైయస్సార్ ఘాట్ నుండి షర్మిల బస్సుయాత్ర ప్రారంభం కానుంది. వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె తన బస్సు యాత్రను ప్రారంభిస్తారు.
ఈ యాత్ర సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో కొనసాగుతుంది. సిడబ్ల్యూసి, యూపిఏ రాష్ట్ర విభజన తీర్మానం, ప్రకటనల తదనంతర పరిణామాల నేపథ్యంలో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతేడాది అక్టోబరు 2వ తేది నుండి వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించగా, అదే నెల 18వ తేది నుండి ఆమె మరో ప్రజా ప్రస్థానం యాత్రను ప్రారంభించారు. ఇప్పుడు బాబు ఆత్మగౌరవ యాత్ర చేపడుతుంటే, బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. షర్మిల బాబుకు పోటీగా యాత్రలు నిర్వహిస్తున్నారనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications