అల్లర్లు: రాష్ట్రపతి పాలనకు, అఖిలేష్ రిజైన్‌కు డిమాండ్

గత శనివారం నుంచి ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు, అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముజఫర్‌నగర్ మత ఘర్షణలు, అల్లర్లలో మరణించినవారి 28కి చేరింది. రెండువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి ముజఫర్‌నగర్ వెళ్తున్న కేంద్రమంత్రి అజిత్ సింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముజఫర్‌నగర్‌లో సోమవారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది.
ప్రధాని ఖండన
ముజఫర్‌నగర్‌లో మతఘర్షణలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం ఖండించారు. అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని అల్లర్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు పరిరక్షించాలని సూచించారు.
కాగా ఎన్నికల నేపథ్యంలో మత ఘర్షణలు జరుగుతాయని యూపి ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించానని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తన హెచ్చరికల్ని అక్కడి ఎస్పీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే పలు మత ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications