వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాపై మిలిటరీ స్ట్రైక్: బరాక్ ఒబామా ఎదురీత!

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/డమాస్కస్: సిరియా పైన మిలిటరీ జోక్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు చుక్కెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ సెనేటర్స్ సిరియాపై మిలిటరీ జోక్యానికి ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు.

సిరియాలో మిలటరీ స్ట్రైక్‌కు కాంగ్రెస్సెనల్ మద్దతు లభించక పోవచ్చునని బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. అయితే, సెనేటర్స్ తన ప్రతిపాదనను తిరస్కరిస్తే ఏం చేస్తాననే విషయాన్ని ఒబామా చూచాయగా చెప్పలేదు. ఏం చేయాలనే విషయంపై తాను ఇంకా నిర్ణయించలేదని ఒబామా చెప్పినట్లుగా తెలుస్తోంది. సిరియాలో మిలటరీ స్ట్రైక్ కోసం మద్దతు కూడగట్టేందుకు ఒబామా తీవ్ర ప్రయత్నాలు చేశారు.

Obama faces resistance in Senate, Syria vote delayed

కాంగ్రెసు మద్దతిచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. అయితే, మిలటరీ జోక్యంపై సిరియా ధీటుగా స్పందించడం, రష్యా వంటి దేశాల మద్దతు లభించడంతోనే కాంగ్రెసు వెనక్కి తగ్గిందని అంటున్నారు. తమ కెమికల్ వెపన్స్‌ను అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా మార్చేందుకు సిరియా ముందుకు వచ్చింది. అయితే, ఒబామా ప్రభుత్వం మాత్రం సంశయిస్తోందంటున్నారు.

కాగా, మీడియా వార్తల ప్రకారం... సిరియాలో మిలిటరీ స్ట్రైక్ కోసం ఒబామాకు యాభై సెనేట్ ఓట్లు తక్కువ పడుతున్నట్లుగా తెలుస్తోంది. తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆరుగురు డెమోక్రటిక్ సెనేటర్స్ బహిరంగంగా చెప్పారు.

English summary

 US President Barack Obama faced stiff resistance from the opposition Republican Senators and scepticism from his own Democrats, forcing the Senate Majority Leader Harry Reid to postpone the vote on military intervention in Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X