లోకేష్‌పై జగన్ పార్టీ: ప్రశ్నపత్రాల దొంగని టిడిపి కౌంటర్

TDP counter to YSR Congress
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నాపత్రాల దొంగ అని, ఆ పార్టీ దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్, నేరాలకు పేటెంట్ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నర్సి రెడ్డి బుధవారం విమర్శించారు.

జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు చిన్నప్పుడే హిమయత్ నగర్‌లో పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ చేసి అమ్ముకునే వారని ఆరోపించారు. 1986-87లో వీళ్లిద్దరు కలిసి మేడ్చల్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాలు దొంగిలించేందుకు కారులో వెళ్లి పోలీసులకు దొరికిపోలేదా అని ప్రశ్నించారు.

పోలీసులు విచారణ జరిపితే ఆ కారు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్నట్లు తేలిందన్నారు. ఈ కేసు మేడ్చల్ కోర్టులో నాలుగైదేళ్ల క్రితం వరకు విచారణ జరిగిందని, జగన్, శ్రీకాంత్ రెడ్డిల కారణంగా నాడు పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు కేసులు ఎదుర్కొని, తర్వాత ఏ ఉద్యోగం రాక తీవ్రంగా ఇబ్బందులు పడడం వాస్తవం కాదా అన్నారు.

సిబిఐ వేసిన ఎనిమిది ఛార్జీషీట్లలో జగన్ మొదటి ముద్దాయిగా ఉన్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాగా, నారా లోకేష్ పైన శ్రీకాంత్ రెడ్డి నిన్న విమర్శలు చేయగా, నర్సిరెడ్డి పై విధంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+