వీడియో: కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 1995 తర్వాత ఈ స్థాయిలో నీరు..

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో భీతావాహ పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ప్రాజెక్టుల కింద ఉన్న గ్రామాలు బిక్కు బిక్కుమంటున్నాయి. ఏ అర్ధరాత్రి అధికారి వచ్చి ఖాళీ చేయమంటారనే బెంగ ఉంది. నిర్మల్ జిల్లాలో గల కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండగా.. ఔట్ ప్లో అంతగా లేదు. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. పరివాహాక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అర్దరాత్రి 2 గంటలకు సైరన్ మోగించి.. దాదాపు 25 గ్రామాల ప్రజలను తరలించారు.

1995 తర్వాత పోటెత్తిన వరద

కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. ఎగువన కురుస్తున్న వానలతో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోంది. 1995 తర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటి సారని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి 2 లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్‌ రూమ్‌లోకి వరద నీరు చేరింది.

17 గేట్లను ఎత్తివేసి..

17 గేట్లను ఎత్తివేసి..

భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 18 గేట్లలో ఒక గేటు మొరాయించింది. దీంతో 17 గేట్ల ద్వారా వరదను కిందికి విడుదల చేశారు. భారీగా నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ఉధృతిపై మంత్రికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఆరా తీశారు.

వరద బీభత్సం

వరద బీభత్సం

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి శంభు మత్తడి గూడ ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. వరద దిగువ ప్రాంతాల్లోకి చేరుతోంది. దిగువన ఉన్న లక్కారం, గంగన్నపేటకు వరద ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఇచ్చోడలో 32.90 సెంటీమీటర్లు, నేరడిగొండలో 29.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో 3 రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+