చంద్రబాబు తో డీఎల్ భేటీ : మైదుకూరు సీటు ఖరారు : పుట్టా సుధాకర్‌కు హ్యాండ్ ...!
కాంగ్రెస్ సీనియర్ నేత..మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి టిడిపిలో చేరిక ఖరారైంది. ముఖ్యమంత్రి తో భేటీకి టైం ఫిక్స్ అయింది. కడప జిల్లాల సీట్ల ఖరారు అంశంలో మైదుకూరు సీటు విషయంలో తుది నిర్ణయం పెండింగ్ లో పె ట్టారు. అయితే, డిఎల్ అమరావతిలో భేటీకి ముందే మైదుకూరు సీటు ఖరారు చేసినట్లు సమాచారం. ఇదే సమయం లో టిడిడి ఛైర్మన్ గా ఉన్న పుట్టా సుధకార్ యాదవ్ కు మైదుకూరు సీటు లేనట్లే..
టిడిపి లోకి డిఎల్ ఎంట్రీ..
కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ దిగ్గజం కొంత కాలంగా టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగినట్లుగా నే డిఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి తో భేటీ కానున్నారు. ఆయన టిడిపి అభ్యర్దిగా వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుం డి పోటీ చేయటం దాదాపు ఖరారైంది. డిఎల్ ఇప్పటి వరకు మైదుకూరు నుండి ఆరు సార్లు గెలుపొందారు. నేదురుమ ల్లి, కోట్ల, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు. 2012 లో జగన్ కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కడప లోక్‌సభ నుండి పోటీ చేసారు. ఆ సమయంలో జగన్ పై పోటీ చేసిన డిఎల్ డిపాజిట్ కోల్పోయారు. మైదుకూరు లో డిఎల్..రఘురామిరెడ్డి మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ పోరు ఉంది. డిఎల్..రఘురామిరెడ్డి పైన నాలుగు సార్లు గెలవగా..డిఎల్ మీద రఘురామిరెడ్డి రెండు సార్లు గెలిచారు. 2014 ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ మీద రఘురామిరెడ్డి వైసిపి నుండి గెలుపొందారు.

సుధాకర్ యాదవ్ కు హ్యాండ్..
మైదుకూరు టిక్కెట్ డిఎల్ కు ఇస్తున్నట్లుగా టిడిపి నుండి డిఎల్ కు సమాచారం అందింది. ఆ హామీతోనే డిఎల్ రవీంద్రారెడ్డి అమరావతి లో ముఖ్యమంత్రి తో సమావేశం అయ్యేందుకు ముందుకు వచ్చారు. దీంతో..గత ఎన్నికల్లో మైదుకూరు నుండి పోటీ చేసి..ఇప్పుడు టిటిడి ఛైర్మన్ గా ఉన్న సుధాకర్ యాదవ్ కు నిరాశ తప్పేలా లేదు. తాను టిటిడి చైర్మన్ అయినా..తానే మైదుకూరు బరిలో ఉంటానని చెబుతూ వచ్చారు. ఇక, ఇప్పుడు డిఎల్ కు స్వయంగా ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడుతుండటం..ఆయనకు మైదుకూరు సీటు ఇస్తుండటంతో ఇప్పుడు సుధాకర్ యాద వ్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. అయితే, సుధాకర్ యాదవ్ ను బుజ్జిగించే బాధ్యతను ఆయన వియ్యంకుడు ..ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కు ముఖ్యమంత్రి అప్పగించారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications