అభిమానులే రక్ష.. గన్‌మెన్లు అవసరం లేదు, తిప్పిపంపిన రాధా
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా హత్యకు కుట్ర కామెంట్స్ దుమారం రేపాయి. రాధా కామెంట్స్ చేయగా.. ఏపీ ప్రభుత్వం అదే స్పీడులో స్పందించింది. టు ప్లస్ టు గన్ మెన్లను కూడా కేటాయించింది. అయితే తనకు భద్రత అవసరం లేదని.. అభిమానులు చాలు అని రాధా కామెంట్స్ చేశారు. ప్రాణహాని ఉందని చెప్పడంతో రాధాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ భద్రతను వంగవీటి రాధ తిరస్కరించారు. గన్ మెన్లను ఆయన తిప్పి పంపేశారు.

అభిమానులే రక్ష..
తన అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు. గన్ మెన్లు వద్దన్న మాట వాస్తవమే అని చెప్పిన వంగవీటి రాధా.. మీడియాతో చిట్ చాట్ చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, అందుకే గన్ మెన్లను వద్దని చెప్పాను. అన్ని పార్టీల నుంచి తన శ్రేయస్సు గురించి అడుగుతూ ఫోన్లు వచ్చాయి. పార్టీలకు అతీతంగా తనతో మాట్లాడారు. అన్ని పార్టీల వారితో నాకు పరిచయాలు ఉన్నాయి. పోలీసులు ఇప్పటివరకు రాలేదు. వచ్చినపుడు స్పందిస్తానని రాధా అన్నారు. తనకు గన్ మెన్లు అవసరం లేదని.. వెళ్లిపోవాలని రాధా తమతో చెప్పారని గన్ మెన్లు తెలిపారు. విషయాన్ని తాము ఉన్నతాధికారులకు తెలియజేశామని.. అధికారులు తమను వచ్చేయమన్నారని, అందుకే వెళ్లి పోతున్నాము అని వారు వెల్లడించారు.

హత్యకు కుట్ర..
తన హత్యకు కుట్ర జరిగిందని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు తన హత్యకు కుట్ర చేశారని.. రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించారు. హత్యకు కుట్ర చేసింది ఎవరో త్వరలోనే తెలుస్తుందన్నారు. దీనిపై కలకలం రేగింది. రాధా చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. రాధాకు 2+2 గన్‌మెన్‌ను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఆదేశించారు. రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం సూచించారు.

స్నేహితులు
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఉదయం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి వంగవీటి రంగాకు నివాళులర్పించిన ఆయన.. కాసేపు వంశీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన జిల్లాలో పలుచోట్ల జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వంగవీటి రాధా.. మధ్యాహ్నం వంశీతో కలిసి గుడివాడ నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రి కొడాలి నాని వీరికి స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురూ కలిసి గుడ్లవల్లేరు మండలం వేమరంలోని కొండాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదే మండలం చినగొన్నూరులో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో రాధా.. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications