Severe Rainfall Alert:జవాద్ ఎఫెక్ట్.. ఇవాళ, రేపు ఏపీలో వర్షం
జవాద్ తుఫాన్ ఉత్తరదిశగా కదులుతుంది. విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయంగా2 10 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పూరికి దక్షిణ నైరుతిగా 390 కిలోమీటర్ల దూరంలో ఉంది. పారాదీప్‌కు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా బలహీనపడి
ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ కేంద్ర అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత బలహీనపడుతూ రేపు ఉత్తర ఈశాన్యదిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల ఇవాళ, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాను తీవ్రత ఇంకా కోస్తాపై రేపు సాయంత్రం వరకు ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సునంద సూచించారు.

ఇటు ఏపీలో వానలు కురిసే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంకా కోలుకోలేదు. నెల వ్యవధిలో రెండు సార్లు అతి భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోవడం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలు ఉన్నాయి.
గత 15 రోజులుగా తమిళనాడు భారీవర్షాలతో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. చెన్నైలోని చాలా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి కోలుకోలేదు. ఈ సమయంలో మరోసారి వానగండం పొంచి ఉండటంతో తమిళనాడు వాసులు టెన్షన్ పడుతున్నారు.












Click it and Unblock the Notifications