రమ్య నిందితుడికి ఉరి ఎప్పుడు.. 14 రోజుల్లో: నారా లోకేశ్
బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసి.. పోలీసులు సాయంత్రానికి విడిచిపెట్టారు. ఆ సమయంలో నారా లోకేశ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 21 రోజుల్లోగా రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే తాము తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని లోకేశ్ హెచ్చరించారు.
ఈ అంశంపై లోకేశ్ మరోసారి లోకేశ్ స్పందించారు. తాను విధించిన డెడ్ లైన్ కు ఇంకా 14 రోజులే మిగిలున్నాయని స్పష్టం చేశారు. విద్యావంతురాలైన రమ్యని హత్యచేసిన వాడికి ఉరి ఎప్పుడు? అని ప్రశ్నించారు. ఇటు ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తనపైకి ఉసిగొల్పుతున్నారని లోకేశ్ ఆరోపించారు. పోలీసు అధికారుల సంఘాన్ని ఉసిగొల్పడానికి చూపించిన శ్రద్ధ మహిళల రక్షణ కోసం చూపించి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని లోకేశ్ హితవు పలికారు. ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తన మీదకి ఉసిగొల్పడానికి పడ్డ శ్రమ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే జగన్ రెడ్డి పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదని నారా లోకేశ్ అన్నారు.

అంతకుముందు రమ్యను ఒక మృగాడు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్యచేశాడని లోకేశ్ గుర్తుచేశారు. దోషులకు ఏం శిక్ష వేయబోతున్నారు?" అంటూ ప్రశ్నించారు. రమ్య హత్య జరిగితే... గన్ కన్నా ముందు వస్తాడన్న జగన్ ఎక్కడికెళ్లారని లోకేశ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందించడం బాధాకరమని పేర్కొన్నారు. "దిశ చట్టం తెచ్చామని మీరు చెబుతున్నారు. 20 రోజుల్లో గనుక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21వ రోజున టీడీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయమే రమ్య హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. నిందితుడు శశికృష్ణకు, రమ్యకు ఆర్నెల్ల కిందట ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రేమించాలని రమ్య వెంటపడేవాడని, రెండు నెలలుగా మితిమీరి వేధించాడని తెలిపారు. దాంతో శశికృష్ణతో రమ్య మాట్లాడడం మానేసిందని, ఇది మనసులో పెట్టుకున్న శశికృష్ణ పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. చివరికి ఆమెతో వాగ్వాదం జరిగిన అనంతరం కత్తితో నరికి చంపాడని తెలిపారు.
Recommended Video
స్థానికులు అడ్డుకుని ఉంటే రమ్య బతికుండేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల యువత దూరంగా ఉంటే మేలని హితవు పలికారు. ఇలాంటి పరిచయాలను ఆసరాగా చేసుకుని వేధించే వాళ్లపై ఫిర్యాదు చేయాలని, రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మృతురాలి ఫోన్ డేటా నుంచి డిలీట్ అయిన వివరాలను కూడా రాబట్టి, దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అన్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి చైతన్యం కలిగించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారని వెల్లడించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications