Pawan Kalyan: పవన్ కు పరిటాల గుండు కొట్టించారా - క్లారిటీ ఇచ్చిన శ్రీరాం..!!

Pawan Kalyan- Paritala: పవన్ కల్యాన్ కు పరిటాల గుండు కొట్టించారనేది చాలా కాలం క్రితం జరిగిన ప్రచారం. ఇప్పుడు మరోసారి ఆ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీని పైన పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాం క్లారిటీ ఇచ్చారు. ఒక భూ వివాదంలో పవన్ కు పరిటాల గుండు కొట్టించారంటూ చాలా ఏళ్ల క్రితం ఏపీలో న్యూస్ వైరల్ అయింది. అయితే అందులో అసలు నిజం ఉందా లేదా అనేది ఎవరూ నిర్దారించలేదు. దీని పైన ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పరిటాల శ్రీరాం స్పష్టత ఇచ్చారు. పవన్ కల్యాణ్ - పరిటాల కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో వివరించారు.

పవన్ కల్యాణ్ పైన పరిటాల శ్రీరాం ఆసక్తి కరం అంశాలను వెల్లడించారు. పవన్ కు సమాజం పట్ల బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఎవరైనా నాయకుడిగా ఎదిగే సమయంలో ఇటువంటి రూమర్లు ప్రచారంలోకి రావటం సహజమైనవిగా తేల్చేసారు. వస్తున్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే, అసలు నిజం లేకపోతే ఏరకంగా స్పందిస్తామని శ్రీరామ్ ప్రశ్నించారు. పవన్ ఇమేజ్ ను తగ్గించటానికి ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారని శ్రీరాం చెప్పుకొచ్చారు. పవన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎవరు ఎన్ని రూమర్లు ప్రచారం చేసినా పవన్ అర్దం చేసుకోగలరని శ్రీరాం వ్యాఖ్యానించారు. పవన్ ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం మినహా.. పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి అర్దం లేని ప్రచారాలకు ఇప్పటికైనా ముగింపు పలకాని శ్రీరాం సూచించారు.

Anantapur:Forgotten Pawan Kalyans head Tonsure episode comes to light once again,Paritala sriram clarifies

అప్పట్లో ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రచారం ఇప్పుడు శ్రీరాం ఇంటర్వ్యూలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు పరిటాల శ్రీరాం ఇచ్చిన క్లారిటీతో ఇక దీనికి ముగింపు లభించినట్లయింది. ప్రస్తుతం టీడీపీ - జనసేన మధ్య పొత్తు వ్యవహారం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు అందరం కలిసి పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, పరిటాల కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో రాప్తాడు కీలకం కానుంది. ఈ సారి గెలుపు పైన పరిటాల శ్రీరాం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అదే సమయంలో తాను మరోసారి గెలవటం ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు. కొద్ది రోజులుగా పరిటాల వర్సస్ తోపుదుర్తి మధ్య రాజకీయం హోరా హోరీగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+