ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కదిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కదిరి, నల్లమాడ మండలాలు పూర్తిగా కదిరి నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడ నుండి మూడు సార్లు గెలిచిన వేమారెడ్డి శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. రెండు సార్లు గెలిచిన మహ్మద్ షకీల్ గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఒకసారి గెలిచిన నిజాం వలి అప్పట్లో చెన్నారెడ్డి క్యాబినె ట్ లో మంత్రి గా ఉన్నారు. 1994 లో గెలిచిన జొన్న సూర్యనారాయణ..2004 లో గెలిచిన జొన్నా రామయ్య సోదరులు. ఇక, 2004 లో ఇక్కడి నుంఇ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన ఓడిపోగా, 2009 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసి గెలిచా రు. తిరిగి 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండే టిడిపి అభ్యర్దిగా పోటీ చేసారు.
14 సార్లు ఎన్నికలు..
కదిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడు సార్లు కాంగ్రెస్ గెలవగా.. నాలుగు సార్లు టిడిపి గెలిచింది. బిజెపి అభ్యర్ది పార్దసారధి 1999 లో గెలుపొందారు. ఒక సారి స్వతంత్ర అభ్యర్ది గెలవగా.. ఒక సారి వైసిపి గెలుపొందింది. 2009 లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన సిద్దారెడ్డి కదిరి లో 18177 ఓట్లు సాధించారు.

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో మొత్తంగా 22357 ఓట్లు ఉండగా, అందులో169067 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన చాంద్ భాషా కు 81639 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన కె వెంకట ప్రసాద్ కు 82671 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ది చాంద్ భాషా 968 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి నుండి గెలిచిన చాంద్ భాషా కొంత కాలం క్రితం టిడిపిలోకి ఫిరాయించారు. అయితే, అక్కడ టిడిపి అభ్యర్దిగా పోటీ చేసిన వెంకట ప్రసాద్...చాంద్ భాషా ల మధ్య రాజకీయ పోరు ఇంకా సాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications