ఏపీలో నిన్నటి కంటే పెరిగిన కేసులు: 16వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్త కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 59,198 నమూనాలను పరీక్షించగా.. 1063 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1063 కరోనా కేసులు, 11 మంది మృతి

ఏపీలో కొత్తగా 1063 కరోనా కేసులు, 11 మంది మృతి

తాజాగా నమోదైన 1063 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,95,669కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒకరు మరణించారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,671 మృతి చెందారు.

ఏపీలో 16,341 యాక్టివ్ కేసులు

ఏపీలో 16,341 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1929 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,65,657కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 16,341 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,67,609 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 211 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా అనంతపురం జిల్లాలో 10 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు


ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 10, చిత్తూరులో 211, తూర్పుగోదావరిలో 53, గుంటూరులో 104, కడపలో 19, కృష్ణాలో 103, కర్నూలులో 17, నెల్లూరులో 198, ప్రకాశంలో 98, శ్రీకాకుళంలో 30, విశాఖపట్నంలో 61, విజయనగరంలో 12, పశ్చిమగోదావరిలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,83,002, చిత్తూరులో 2,35,406 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,869) కరోనా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా తగ్గిన కొత్త కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా తగ్గిన కొత్త కరోనా కేసులు

ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు భారీగా తగ్గాయి. భారతదేశం గత 24 గంటల్లో మొత్తం 25,166 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ఇదే సమయంలో 437 మరణాలు నమోదయ్యాయి. ఇది మార్చి 16 తర్వాత అత్యల్పంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా మంగళవారం తెలిపింది. గత 24 గంటల్లో 15,63,985 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 25,166 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,69,846కి తగ్గింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీలు దేశవ్యాప్తంగా 3,14,48,754 వద్ద ఉన్నాయి. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 12,101 తగ్గాయి. కరోనా కేసులు నమోదులో గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే కేరళలో అత్యధికంగా 12,294 కేసులు నమోదయ్యాయి, తరువాత మహారాష్ట్రలో 4,145 కేసులు, తమిళనాడులో 1,851 కేసులు, కర్ణాటకలో 1,065 కేసులు మరియు ఆంధ్రప్రదేశ్‌లో 909 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో 80.52 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. ఒక్క కేరళ మాత్రమే 48.85 శాతం కేసులను నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+